మిడ్ నైట్ ఇన్ పారిస్ అని ఓ సినిమాని ఎ వండర్ ఫుల్ లవ్ లెటర్ టూ ఫ్యారిస్ అని అంతర్జాతీయ విమర్శకులు ప్రశంసించారు ప్రముఖ దర్శక రచయిత ఊడీ అలెన్ కెరీర్ లో ఇది ఎంత పెద్ద హిట్ అంటే ఇంత కంటే ఎక్కువ డబ్బు వచ్చిన సినిమా ఇంకోటి లేదు. లెక్కలేనన్ని అనుభవాలు వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది ఈ చిత్రం .ఈ సినిమాలో గిల్ పెండర్ అనే సక్సెస్ ఫుల్ హాలీవుడు స్క్రీన్ ప్లేరైటర్ ఒకే రకమైన స్క్రీన్ ప్లేలు రాసిరాసి విసిగిపోయి ఒక కొత్త నవల రాయటం మొదలు పెడతాడు. ఇంతలో ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆమె తల్లిదండ్రులు పారిస్ వెళుతుంటే వాళ్ళతో వెలుతాడు. కళలంటే పారిస్ .గిల్ పెండర్ కు 1920 నాటి పారిస్ అక్కడి కళాకారులు వాళ్ళ సృజనాత్మకత గుర్తోచ్చాయి.ఆ ఆలోచనతో అర్థరాత్రి అలా వెళుతూ ఉంటే ఓ పాతకాలం కారు కనిపిస్తుంది. అందులో ఎక్కేసి 1920 రోజుల్లోకి ప్రయాణం చేసి పికాసో, హెమ్మింగ్వేవంటి వాళ్ళను కలుస్తాడు.కాలం ఆహ్వానించిన ఆ కాలంలో మనుషులను కలిశారు. మనుషులందరూ ఒకటే ,కాలంనైనా అన్ని వైరుధ్యాలు ఉంటాయని అర్ధమవుతోంది. అలా కనువిప్పు కలిగాక కాలం పంపిన కారు మాయం అవుతుంది. ఎంతో గొప్ప సినిమా ఇది.

Leave a comment