వృద్ధులు, మానసికంగా ఎదగని పిల్లలకు సంగీతం, నాట్యం నేర్పిస్తాను. సంగీతానికి వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంది. క్యాన్సర్ రోగులకు స్వాంతన కలిగిస్తుంది. అందుకే వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాల్లో మ్యూజిక్ షో లు చేసి వారికి వినోదం అందిస్తాను అంటుంది వీణ మోదాని. రాజస్థాన్ ఆశాభోంస్లే గా పేరు తెచ్చుకున్న వీణ ఆర్థిక స్తోమత లేని వారికి సహకరించేందుకు ఒక డాన్స్ అకాడమీ నెలకొల్పారు సంగీతం నాట్యం ఇష్టమైన పిల్లలకు ఇక్కడ ఉచితంగా నేర్చుకునే అవకాశం ఉంది. ఎక్కడ సంగీతం నేర్చుకొని వీణ ఇప్పుడు వందల మందికి శిక్షణ ఇస్తూ లెక్కకు మించిన లైవ్ షో లు చేస్తున్నారు. 7 భాషల్లో పాడగల వీణ గొంతులో లతా మంగేష్కర్ స్వరం లోని మాధుర్యం ఆశాభోంస్లే గమ్మత్తు స్వరం కలిసి వినిపిస్తాయి.

Leave a comment