ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా, గృహిణి, తల్లిగా తన వంతు పాత్ర నిర్వహిస్తూ ప్రో కబడ్డీ లీగ్ లో మహిళ రిఫరీ లలో ఒకరుగా ఎం కె సంధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2014లో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం అయితే 2018 నుంచి మహిళా  రిఫరీలను కూడా ఆటలో ఉపయోగిస్తున్నారు .అందుకు తగిన సెలక్షన్స్ లో తమిళనాడు  వెల్లూరు నుంచి ఎంపికైన సంధ్య సీజన్ 6 తో మొదలై ప్రస్తుతం బెంగళూరులో డిసెంబర్ 22 నుంచి కొనసాగుతున్న సీజన్ 8 కూడా సంధ్య కొనసాగుతోంది కబడ్డీ క్రీడాకారుడు కాంతివరన్‌ ఆమె భర్త. ఆయన ప్రోత్సాహంతో డిగ్రీ బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి దక్షత భారత మహిళా కబడ్డీ టీమ్  తో కబడ్డీ ఆడటం మొదలు పెట్టింది ఇప్పుడు కబడి రిఫరీగా ఈ ఉపాధి పట్లా యువత లో కుతూహలం రేపుతోంది సంధ్య.

Leave a comment