నిద్రకు అందానికి అవినాభావ సంబంధం వుంటుంది. ఏడెనిమిది గంటలు ప్రశాంతంగా నిద్ర పోగాలిగితే అనేక అంతర్గత జీవన క్రియలు కొనసాగుతాయి. ఈ ప్రక్రియల్ని సక్రమంగా పూర్తయితే ముఖం ప్రత్యేకంగా మెరిసిపోతుంది. అదే నిద్ర లేకపోతె ముఖం పేలవంగా నీరసంగా వుంటుంది. వయస్సు మీద పడిన బ్ర్రాంతి కలిగిస్తుంది. కళ్ళ కింద వుబ్బులు వచ్చి అలసాక్ టగా కనిపిస్తారు. నిద్ర చాలనప్పుడు బరువు పెరుగుతారు. పనుల్లో చురుకుదనం పోతుంది. కనుక కంటి నిండా నిద్రపోతే అందం ఇనుమడించి నిగారింపుగా కనిపిస్తారు. అయితే అతిగా నిద్రపోయినా ఆ నిద్ర ప్రభావం అందం పై ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్ర పొతే చర్మం సాగిపోతుంది. ఇది అనారోగ్యకర లక్షణం. ఆహారం కొద్దిగానే తిన్నా పది గంటలకు మించి నిద్ర పొతే స్థూలకాయం తప్పడంటున్నారు. ఏ విషయంలోనైనా అతి అనర్ధదాయకమె.
Categories