బాడీ బిల్డింగ్ లో ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకొన్న తోలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది భూమికా శర్మ. అమ్మ వెయిట్ లిఫ్టర్. భారత మహిళా వెయిట్ లిఫ్టింగ్ బృందానికి శికశాకురాలు. షూటింగ్ లో శిక్షణ పొంది జాతీయ స్థాయిలో బంగారు వెండి పతకాలు అంతర్జాతీయ పోటీల్లో కాంస్యం అందుకున్నారు. పదహారేళ్ళ వయస్సులో బాడీ బిల్డింగ్ వైపు ద్రుష్టి పెట్టాను. శ్రమ కి జీవితంలో భాగం ఉత్తరాఖండ్ లో అమ్మాయి లెవరూ బాడీ బిల్డింగ్లో లేరు. నేను ఏకంగా జాతీయ చాంపియన్ షిప్ కు ఎంపికయ్యాను ఇటలీ లోని వేన్నిస్ లో బాడీ బిల్డింగ్ ప్రపంచ సుందరిపోటీలకు వెళ్లి కిరీటం దక్కించుకున్నాను ఆ సమయంలో మన జాతీయ పతాకాన్ని పట్టుకుని నిలబడితే, ఇంత కష్టం ఒక నిమిషంలో మాయమైంది. సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి అని చెప్పుతుంది భూమికా శర్మ. ఇరవై ఒక్క సంవత్సరాలికే ఇంత సక్సెస్ సాధించిన భూమిక కు అభినందనలు.
Categories