హై హీల్స్ తో రోడ్డుపైన నడుస్తూ ఒక సారి పిల్లి మొగ్గ వేసి సంచలనం సృష్టించింది పరుల్ అరోరా పాతికేళ్ల ఈ జిమ్నాస్ట్ గత సంవత్సరం చీరె తో పిల్లిమొగ్గలు వేసి ఒక్కేరోజులో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది. తాజాగా ఆమె పాయింటెడ్ హీల్స్ తో చక్కగా వేసుకొని రోడ్డు పైన నడుస్తూ హఠాత్తుగా బండి చక్రం తిరిగినట్లు గుండ్రంగా తిరిగి మరి పిల్లి మొగ్గ వేసి తిరిగి హై హీల్ పైన నిలబడి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఫీట్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది. చీరకట్టుతోను, పాయింటెడ్ షూ తోను ఇలాంటి ఫీట్లు చేయటం పరుల్ కి మాత్రమే చేతనైన విద్య అంటున్నారు నెటిజన్స్.

Leave a comment