Categories
WhatsApp

కొన్ని పచ్చిగా, మరికొన్ని ఉడికించి.

కూరగాయలంటే అన్ని రకాలు వండేసి తినేస్తే ఒకే ఫలితం ఉండదు. కొన్ని పచ్చివిగా కొన్ని వండి తింటే లాభం. ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైటో న్యుత్రియంట్ వుంటుంది. ఇది ఆస్ట్రియో ఆర్దరైటీస్ రాకుండా అరికడుతుంది కనుక ఉల్లుపాయలు అప్పుడప్పుడైనా పచ్చివి తినాలి. బెల్ పెప్పర్స్ లో విటమిన్ సి వుంటుంది. ఇది కంటి జబ్బులు రానివ్వదు దీన్ని పచ్చిగాను, కొంచెం ఉడికించి గానీ తినాలి. ఇక టొమాటోల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్ ఫైటో కెమికల్ లైకొ పైన్ అనే పోశాకాన్ని శరీరం అరిగించుకోవాలంటే వీటిని ఉడికించే తినాలి. బీట్ రూట్ లో వుండే పోలేట్ గర్భిణుల్లో పిండం ఎదుగుదలకు ఎంతో ఉపయోగ పడుతుంది. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవడం ఎంతో మంచిది.

Leave a comment