శుభాకాంక్షలు చెప్పేందుకు గులాబీ బొకేలు ఇస్తూ వుంటారు. ఇప్పుడీ శుభాకాంక్షలు నేరుగా గులాబీల అబ్బోత్తి ఇచ్చే ప్రింటర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ ప్రింటర్ల ద్వారా నిమిషానికి ఆరు నుంచి పది గులాబీల పై సందేశం అచ్చువేయవచ్చు. అలాగే ఇష్టమైన వాళ్ళ ఫోటోలు అచ్చు వేయవచ్చు. అంతేనా ఈ గులాబీ ముద్రణ పూర్తిగా వ్యక్తి గతమేకాదు. కొన్ని కంపెనీలు తమ లోగోలు, వ్యాపార ప్రకటనలు కూడా ముద్రించి గులాబీలను మార్కెట్లోకి ప్రేవేశపెడుతున్నాయి. ఒక చక్కని వ్యాఖ్య, ఓ మంచి మాట. అందమైన పరబంధం, సామెత ఇటువంటివీ గులాబీలపైన చక్కగా అద్ది ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే జపాన్ చైనా, తైవాన్ అమెరికా ఐరోపా దేశాల్లో ఈ గులాబీల ప్రింట్ల వాడకం విరివిరిగా వుంటే ఇప్పుడు మన నగరాల్లోకి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అంటే మనం ఏవీ చెప్పకుండానే మన మనస్సులోని మాటను మాట్లాడేస్తాయన్న మాట ఈ గులాబీలు.

Leave a comment