విద్యతో జీవితాలు ఎట్లా మారుతాయో తెలుసుకొన్నాను. భారతదేశం నన్ను అక్కున చేర్చుకుంది. ఈ దేశం చూపిన ప్రేమ ఆప్యాయత మరువలేను. లండన్ లో కోర్స్ పూర్తి కాగానే ఆఫ్గాన్ వెళ్తాను అక్కడ ఆడపిల్లల మహిళల చదువుల కోసం కృషి చేస్తా నంటోంది లైలా రాసేఖ్. ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో పుట్టిన లైలా తల్లే వ్యభిచార ముఠాకు అప్పగించింది. ఏడేళ్ల వయసు నుంచి ఆ నరక కూపం లో గడిపిన లైలా ను డబ్ల్యూ ఏ డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు ఆదుకున్నారు. ఆమెను కాపాడేందుకు భారత్ కు పంపారు. తమిళనాడు లోని కొడైక్కెనాల్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించారు. ఆ తరువాత ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో పిజీ చేసింది. లండన్ లో చదువుకోవాలి అనుకుంది క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆ చదువుకు కావలసిన డబ్బు ఇచ్చారు దాతలు. ఇప్పుడు లండన్ లో చదువుకుంటోంది లైలా.

Leave a comment