Categories
WhatsApp

అవిశ్రాంతంగా పని చేసేది మెదడే.

నిద్రిమ్చేతప్పుడు మాన్ మెదడు పూర్తిగా విశ్రాంతి తిసుకుంటుందనుకోవడం పొరపాటే. ఆరోగ్యంగా జీవించటానికి అవసరమైన ఎందోక్రైన్ గ్రంధిని రోగనిరోధక వ్యవస్థను హార్మోన్ల కార్యకలాపాలను, మెదడు నిద్రిస్తున్నప్పుడే నియంత్రిస్తుంది. మన జ్ఞాపాలను సరైన రీతిలో పదిలపరుస్తుంది. మెలకువలో వున్నప్పుడు మెదడులో ఒక్క తరంగం పనిచేస్తే చాలు. అదే నిద్రలో వుంటే శరీరరంగమూ, మానసికంగాననూ భావోద్వేగాలను ఏ రకంగానూ అన్ని విధాలా ఉత్తమ స్ధితిలో వుండటానికి ఐదు రకాలైన తరంగాలు పని చేయాలి అంటే మెలకువలో కంటే నిద్రలోనే మెదడు ఎక్కువ పనిచేస్తుంది. శరీర ఆరోగ్యం కోసం శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర పోవాలి. శరీరం లేవగానే ఉత్సాహంతో చురుకుగా వుందీ అంటే నిద్ర సరిపోయింది అని అర్ధం. అలాగే స్త్రీలకు నెలసరి ముందు, గర్భిణిగా వున్నప్పుడు, మెనోపాజ్ సమీపిస్తున్నప్పుడునిద్ర ఎక్కువగా అవసరం. నిజమైన నిద్ర పూర్తి విశ్రాంతి వంటిదే.

Leave a comment