కోడి గుడ్డును డాక్టర్ల నడిగితే పోషకాల మాయం అంటున్నారు. అదే ఫరా  సయిడ్స్ ని అడిగితే అందమైన కళారూపం అంటుంది. అమెరికాలోని స్థిరపడ్డ భరతీయిరాలు ఈమె. ప్రముఖ ఎగ్గ్ ఆర్టిస్ట్. ఆమె ఈ గుడ్డు తో కళాకృతులు తాయారు చేస్తుంది. ఆమెకు గుడ్డును చుస్తే చాలట మంచి ఐడియాలు వచ్చేస్తాయి. రకరకాల గుడ్లు సేకరించి వాటి లోపల భాగాన్ని తీసేసి డొల్ల గా మారిన గుడ్డు తో అందమైన కళాకృతులు చేసేస్తుంది. అతి సున్నితం గా వుండే గుడ్డు పెంకు పైన చిత్రాలు వేయడం, వాటికి అలంకరణ చేయడం చాలా కష్టమైన పని. కానీ ఫరా సయిద్ ఈ పనులన్నీ చాలా తేలికగా చేయగలదు. ఈ అందమైన గుడ్డు బొమ్మల డెకోరేషన్ పీసెస్ గా చాలా బాగుంటాయి. ఆమె ఎగ్గ్ కలక్షన్స్ అన్ని చూడాలంటే ఆమె పెర్స్ నల్ వెబ్ సైట్ www.eggdocs.com  లో చూడోచ్చు. స్త్రీల కోసం ఆమె ఎన్నో చారిటి ఈవెంట్స్ క్రియేట్ చేస్తుంది.

Leave a comment