చింతపండు రసం లేకుండా కమ్మని పులిహోర లేదు సాంబార్లు, దప్పళాలు, చారు, పప్పు ఇలా అన్నింటికి చింతపండు ప్రధమ వస్తువు. దాన్ని రుచి కోసం మాత్రం చూడకండి. ఇది వంటింట్లో అన్నిటిలో వాడుతూ ఉండటం మూలంగానే అందరు ఆరోగ్యంగా ఉన్నారు అంటున్నారు వైద్యులు.  చింతపండు గుజ్జులో పీచు అత్యధికం రక్తపోటు గలవారికి మంచి ఆహారం.  పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఐరన్ తో నిండి ఉండి ఎర్రకణాల వృద్దికి సహకరిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. ఎన్నో రకాల బాక్టీరియా ఇన్ ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.  మృత కణాలను తొలగిస్తుంది.  చర్మం చక్కగా నిగారింపు ఉండేందుకు దోహదం చేస్తుంది.

Leave a comment