ఉదయాన్నే కాఫీ తోనే కళ్ళు తెరిచే కాఫీ ప్రియులున్నారు .మూడు నాలుగు కప్పుల కాఫీ పడితేనే రోజు గడవని వాళ్ళు కొల్లలు .కాఫీ లో ఉండే కెఫిన్ కారణంగానే శరీరంలోని నాడీ వ్యవస్థ చురుకుగా స్పందిస్తుంది. దాని వల్లనే ఎక్కడలేని హుషారు వస్తుంది. రెండు మూడు కప్పుల కాఫీ తాగితే గుండె జబ్బులు దగ్గరకు రావని పరిశోధనలు చెబుతున్నాయి కూడా. పదేళ్ల నుంచి కాఫీ తాగే అలవాటు ఉన్న వెయ్యి మంది పై పరిశోధన చేశారట .ఈ పరిశోధనలో రోజుకి రెండు మూడు కప్పుల కాఫీ తాగే వాళ్లలో గుండె జబ్బులు మరీ ఎక్కువ లేవు. పరిశోధనలో బ్లాక్ కాఫీ బెస్ట్ అనీ, ఇన్ స్టెంట్ కాఫీ కంటే ఫిల్టర్ కాఫీ ఇంకా ఉత్తమం అని తేలిందట .400 మిల్లీగ్రాములు ఉండే నాలుగు కప్పుల కాఫీ తో ఆరోగ్యం భేషుగ్గా ఉందని అంటున్నారు పరిశోధకులు .ఎక్కువగా కాఫీ తాగితే మాత్రం సమస్యలు తప్పవు .అతిగా కాఫీ రక్తపోటును పెంచుతుంది పిల్లలకు మాత్రం కాఫీ ఇవ్వద్దనే చెబుతున్నారు .

Leave a comment