కొన్ని డైట్ ప్లాన్స్ తో మూడేసి రోజుల పాటు పళ్ళు కూరగాయలు,రసాలు తీసుకోవడం ఇప్పటి వరకు జరుగుతున్న పద్దతి.  ఇవి తప్పంటున్నాయి అద్యాయనాలు. రెండు మూడు రోజులు అత్యంత తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం అంటే కేవలం ద్రవాలే తీసుకోవడం వల్ల శరీరంలో గైకోజన్ నీరు తగ్గుముఖం పడతాయి. కోవ్వు తగ్గేది ఏమీ లేదు. పళ్ళ రసాల పై ఆధారపడటం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందవు.  జ్యూస్ లలో ఫైబర్ ,అవసరమైన ప్యాటీ ఆసిడ్లు ఉండవు.  ఎన్నిసార్లు నీళ్ళు తాగినా ఆకలిగానే ఉంటుంది. నీరసం మొదలవుతుంది. రెండుమూడు రోజుల్లో కాస్త బరువు తగ్గినట్లు తేలికగా అనిపించినా తగ్గిన బరువు వెంటనే పెరుగుతుంది.బరువును అదుపులో ఉంచుకునే మార్గం ఒక్కటే. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యయామం చేయడం.

Leave a comment