వర్షాలు పడటం మొదలు పెట్టాక వాతావరణంలో తేమ పెరుగుతోంది. రకరకాల వైరస్ లు బ్యాక్టీరియా ఫంగస్ లు వల్ల అనారోగ్యాలు వస్తాయి.శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు గానూ నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు బాదం, పిస్తా, ఆక్రోట్, పొద్దుతిరుగుడు గింజలు అరటిపండ్లు ఉడికించిన దుంపలు ఉడికించిన శనగలు తప్పనిసరిగా తినాలి ఆకుకూరల్లో  పప్పు ధాన్యాల్లో .ఉండే ఫోలేట్,సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్-డి  పెరుగు మజ్జిగ ల నుంచి వచ్చే ప్రోబయోటిక్స్ ఇవన్నీ రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. ఈ విటమిన్లు మినరల్స్ టాబ్లెట్స్ రూపంలో కంటే ఆహార రూపంలో తీసుకుంటే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది.శుఛి శుభ్రత పాటించడం, వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవటం కాచి చల్లార్చిన నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

Leave a comment