చలికాలంలో చర్మం చాలా చిరాకు పెడుతుంది. పొడి బారి దురదలు పెట్టేస్తుంటాయి. ఈ కాలంలో మాయిశ్చురైజర్ సోప్స్ వాడాలి. అలాగే సబ్బు బదులు సున్ని పిండి వాడాలి. అయిటే స్నానం చేసే ముందర సున్ని పిండి పట్టించి , స్నానం చేసిన వెంటనే మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. చర్మం చిట్లి దురద పెడుతూ వుంటే నీళ్ళ తో తడిపి అప్పటికప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయట పడతారు. కానీ స్నానం చేసిన వెంటనే తేలికైన ఏ నూనె అయినా, చివరకు బేబీ ఆయిల్ అయినా సరే వంటికి పట్టిస్తే ఈ సమస్య రాదు. పిల్లలకు వాడే ఏ నూనె అయినా జిడ్డు గా వుండదు. సం స్క్రీన్ కుడా వాడవలసిందే. పెదవులకు లిప్ బాం రాస్తూ నే వుండాలి చర్మమ విషయం లో మరింట శ్రద్ధ తీసుకోవాలి.

Leave a comment