Categories
Soyagam

మేకప్ తొలగించపోతే చర్మానికి నష్టం.

మేకప్ చేసిన మొహం శుబ్రం చేయకుండా గంటల తరబడి అలా వదిలేయడం, లేదా రాత్రి వేళ మేకప్ తీయకుండా నిద్ర పోవడం రెండు కరెక్ట్ కాదు. మేకప్ ను మొహం పై వదిలేస్తే చర్మం పై బ్రేకవుట్స్ వస్తాయి. చర్మం ఇరిటేట్ అవ్వుతుంది. చర్మం కండి పోవడం లేదా దురద పెట్టడం వంటి సమస్య ఎదురవ్వచ్చు. ఒక వేళ మేకప్ తీయకుండా నిద్రపోతే ఉదయాన్నే తలగడ గలేబాలు మార్చేయాలి. ఎందుకంటే ముఖం పై మురికి, మేకప్ దిండు పైకి చేరి పోతాయి . అలాగే తరచూ ఇలా జరిగితే మాత్రం ముఖ్ చర్మం దెబ్బతింటుంది. మేకప్ రేమూవర్ వాడి ముఖం శుబ్రంగా తుడిచేసుకోవాలి. బేబీ ఆయిల్, బేబీ లోషన్, పాలు, ఆలివ్ ఆయిల్ వెతిలోనైనా ముఖాన్ని తేలికగా శుబ్రం చేసేయవచ్చు.

Leave a comment