Categories
Soyagam

సౌందర్య పోషణలో ఉల్లిపాయి.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత. ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలు. ఇది రక్త పోటును తగ్గించే గుణం కలది ఇందులోని సల్ఫర్ బ్లడ్ ధిన్నర్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయ యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్. ఉల్లిపాయ లోని సాల్ఫర్ ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ ని తగ్గించ గలుగుతుంది. ఉల్లిపాయ కేవలం ఆరోగ్యం కోసమే కాదు. సౌందర్య పోషణలో  అగ్రస్ధానంలో వుంది. తాజా ఉల్లిపాయ రసంతో చర్మాన్ని మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగై చర్మం నిగారిస్తుంది. చర్మం ముడతలు పడదు. పిగ్మేంటేషన్ ను విజయవంతంగా తగ్గిస్తుంది. వుల్లురసం తలకు అప్లయ్ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుతుంది. దీన్ని పచ్చిగాను ఉడికించి తిన్నా ఏ విధంగా తిన్న మంచిదే. సలాడ్స్, సాండ్ విచ్ లు, సూప్స్, గ్రేవీలు కూరలు ప్రతి దానికి ఉల్లిపాయతో చక్కని రుచి వస్తుంది.

Leave a comment