రంగులు పిల్లల మనస్సుల పైన ఎంతో ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. పిల్లల్లో హుషార్ తీరుకురావాలన్న, హైపర్ యాక్టివ్ గా ఉన్నపిల్లలను కుదురుగా ఉంచాలన్న రంగుల వల్ల సాధ్యం అవుతుందంటున్నారు. పిల్లల బెడ్ రూమ్స్ కి వేసే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎరుపు సామాన్యంగా హుషార్ పెంచేది. మెదడులో రక్త ప్రసరణ వేగవంతం చేస్తుందీ రంగు. హైపర్ యాక్టీవ్ పిల్లల బెడ్ రూమ్ కి ఈకలర్ కరెక్టే కాదు. ఆరెంజ్ రంగు ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఆకుపచ్చ ఏకగ్రత తీసుకువస్తుంది. పసుపు శుభాలకు సంకేతంగానూ , స్థిరత్వం చెర్చేదిగానూ ఉంటుంది. నీలం మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. పర్పుల్ సృజనని పెంచుతుంది. గులాబీ విపరీత ధోరణిని అదుపు చేస్తుంది. ఈ విషయాలు పరిగణలోకి తీసుకొని పిల్లల గదులకు కూల్ కలర్స్ ఎంచుకోమంటున్నారు ఎక్సె పర్ట్స్.

Leave a comment