అదిలాబాద్ అడవుల్లోని గోండులది ప్రత్యేకమైన జీవన శైలి. ఎన్నో సమస్యలు, చదువు లేదు వాళ్ళకి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించటం చాలా కష్టం. ప్రభుత్వ అధికారులకు వాళ్ళతో మాట్లాడే అవకాశం లేనే లేదు. అదిలాబాద్ కలెక్టర్ దివ్యా రాజన్ ఈ పరిస్థితుల్లో ఒక గొప్ప నిర్ణయం తీసుకొన్నారు. గోండుల భాష నేర్చుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడేందుకు అనువాదకుని పక్కనే ఉంచుకొని అక్కడి వాళ్ళ సమస్యలు తీర్చేస్తున్నారు. ఆమె కృషి ఫలితంగా ఉట్నూరులో నిర్వహించిన ప్రజావాణికి గోండుల నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ దివ్యా రాజన్ ను గోండులు ఎంతో ప్రశంసిస్తున్నారు. ఇలా భాష తెలసివుంటే తమ కష్టాలు ఎప్పుడో తీరిపోయేవంటున్నారు.

Leave a comment