ఏదైన చక్కని పనిని ఎంచుకుని మనసంత దానిపైన ఫోకస్ చేస్తే సత్ఫలితాలు సాధించేవారు ఈ ప్రపంచంలో అందరికంటే సంతోషంగా ఉంటారు అని అంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. పగటి కలలు కంటూ ఊహాల్లో విహరిస్తూ గాలి మేడలు కట్టే వారికి సంతోషం దక్కదంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా , ప్రతి నిమిషాన్ని తాజాగా ఆస్వాధిస్తూ ఏదైన ఒక వ్యాపకంలో మునిగివుంటూ లేదా చేసే ఉద్యోగం , వృత్తిలో వందశాతం మనసు,ధ్యానం ఉంచి తప్పని సరిగా ఆ పనిలో సక్సెస్ సాధించాలని ప్రయత్నం చేసే వాళ్లకు జీవితంలో ఎప్పుడు విచారం తొంగి చూడదు. విజయం తాలూకు ఆనందం వాళ్ళని మరింత యవ్వనవంతంగా ఆనందంగా తీర్చీదిద్దుతోందని చెపుతున్నారు.

Leave a comment