మోనికా కార్వాల్లో గొప్ప ఫోటో గ్రాఫర్. పుట్టింది స్విట్జర్లాండ్ నివాసం ఇంగ్లాండ్. ఎడోబ్ సాఫ్ట్ వేర్ వాడుతూ తీసిన ఫోటోలను వివిధ ఇమేజెస్ కలుపుతూ అమె వింత దృశ్యాలు సృష్టిస్తుంది. సాధరణంగా మనం చూసే ప్రపంచం వేరూ ఉహా ప్రపంచం వేరు. దానికి పరిమితులు లేవు , సముద్రం దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నట్లు సముద్రాన్ని చూసేందుకు వచ్చేవాళ్ళ దుప్పటి పై నడుస్తున్నట్లు ఒక ఇమేజ్.అలాగే పరుచుకున్న ప్రకృతి మధ్య రహదారి,దాన్ని కప్పుకుని నిద్రపోతున్న యువతి. సముద్రపు నురగని చీరగాచుట్టుకున్న అమ్మాయి నోట్లో ఎగసిపడుతున్న సముద్రం పెదవుల పైన నీలాకాశం ఈమె సృజనకి నిదర్శనాలు ఇవి.