యునానీ వైద్యంలో తేనే ముఖ్యమైన పదార్ధం .ఈ తేనేలో ఎన్నో రకాల దినుసులు కలిపి అనేక రుగ్మతలను పొగోడతారు. దాల్చిన చెక్క ,తేనే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ సమయంలో బ్రెడ్ పైన రోట్టెలపైన వేసి తింటే ధమనుల్లో కొవ్వు పేరుకోదు. గుండెపోటు రాదు. తేనేలో దాల్చిన చెక్క పొడి కలిపి రెండు చుక్కల నీటిలో పేస్ట్ లాగా చేసి కీటకాలు కుట్టిన చోట పట్టీలా వేస్తే నిమిషాల్లో బాధ పోతుంది. జుట్టు ఊడిపోతుందని ఆదుర్దగా ఉంటే వేడి ఆలివ్ నూనెలో తేనే దాల్చిన చెక్క పొడి కలిపి తలపై బాగా మర్ధన చేస్తే ఊడిపోవటం తగ్గుతుంది. ప్రతి రోజు తేనే ,దాల్చిన చెక్క పొడి కలిపి తింటే రోగనిరోధక శక్తి మెరుగ్గా పని చేస్తుంది. తేనేలో ఎన్నో రకాల విటమిన్లు ఇనుము ఉన్నయి. తేనే వాడకం వల్ల తెల్ల రక్తకణలు శక్తివంతమైన బాక్టీరియా వైరస్ లను ఎదుర్కొంటాయి.

Leave a comment