ఒకప్పుడు చిన్న పిల్లల గౌన్ల పైన కుచ్చిళ్ళను వరుసలుగా కుట్టించే వారు.అదే ఫ్యాషన్ ఇప్పుడు అమ్మాయిల డ్రెస్ ల పై సందడి చేస్తున్నాయి. సాధారణంగా ఈ రఫుల్స్ ని విడిగా కుట్టి డ్రెస్ లకు జత చేస్తారు. అంచులు చక్కగా పైపింగ్ చేసి ఈ కుచ్చిళ్ళను దుపట్టాలకు ,బ్లౌజ్ లకు జతచేస్తారు. సాధా చీరెకు జతగా రఫుల్ హ్యాండ్ బ్లౌజ్ చాల బావుంటుంది. వాటర్ ఫాల్ రఫూల్లా మెడచుట్టూ ఉన్నా బాగానే ఉంటుంది. అనార్కలీ డిజైన్స్ కి సర్క్యూలర్ ,రఫుల్స్ అలాగే పొడవాటి గౌన్ లకు ఈ రఫుల్స్ చాలా అందంగా ఉంటాయి. స్కర్టులు ,కుర్తీలే కాకుండా చీరెలు బ్లౌజ్ లకు కూడా ఈ కుచ్చిళ్ళు చక్కగా ఉంటాయి.

Leave a comment