Categories
ఏ తెలుగు పుస్తకం కావాలన్నా అది వేట పాలెం లో ఉండే సరస్వతి నికేతన్ గ్రంథాలయం లో దొరుకుతుంది అంటారు. తెలుగు భాషాభి. 1918 విజయదశమి నాడు ప్రారంభించిన ఆ గ్రంథాలయాన్ని నేటి వరకు వ్యవస్థాపక కుటుంబ వారసులు నిర్వహిస్తున్నారు. ఊటుకూరి వెంకట సుబ్బారావు శ్రేష్ట నాయకత్వంలో 1918లో హిందూ యువజన సంఘం పేరున చిన్న గ్రంథాలయంగా ప్రారంభం అయింది. గాంధీజీ శంకుస్థాపన చేసిన ఈ గ్రంథాలయం టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. 1909 నాటి దిన పత్రికలు పుస్తకాలు దాదాపు లక్ష వరకు ఈ లైబ్రరీ లో ఉన్నాయి. దేశ విదేశాల నుంచి పరిశోధనా నిమిత్తం విద్యార్థులు వస్తారు. అరుదైన తాళపత్ర గ్రంధాలు హిందీ తెలుగు సంస్కృత భాషలు రాసినవి ఇక్కడ ఉన్నాయి.