వర్క్ ప్లెస్ లో స్త్రీల పైన జరుగుతున్న లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతున్నాయనీ ,బాధితుల నుంచి సిటీ పోలీసులకు నెలకు 40 వరకు లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందుతుండగా అందులో కనీసం నెలకు మూడైనా పని చేసే చోట ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించే ఫిర్యాదులు ఉంటున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ పోలీసు కమిషనర్ చెపుతున్నారు.ఇదే విషయాన్ని షీ టీమ్ ఏసిపి నర్మద మాట్లాడుతూ ఫిర్యాదులు చాలా తక్కువే వస్తున్నాయి. కానీ వాస్తవానికి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని బాధీతులు ఎందరో ఉంటున్నారని తన విచారనలో తెలుస్తోందని ,ఉద్యోగం చేసే చోట ఇంకా వేధింపులు ఎక్కువవుతున్నాయనే భయంలో మహిళలు ఫిర్యాదు చేసేందుకు సాహాసించరని అన్నారు.