ఆరోగ్యంగా నాజుగ్గా వుండేందుకు సుక్ష్మ పోషకాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెప్పుతున్నారు డాక్టర్లు. ఈ పోషకాలు జీవక్రియ పైన, ఆకలి పైన, శక్తి పైన    గొప్ప ప్రభావాన్ని కలిగివుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కాల్షియం కొవ్వును కరిగించుకోగలుగుతారు.  పాల పదార్ధాల ద్వారా  కాల్షియం తీసుకుంటే కాల్షియం తో పాటు మాంసాకృతులు కుడా   శరీరానికి అందుతాయి. 50 ఏళ్ళ వయసున్న స్త్రీలకు రోజు 1000 మిల్లీగ్రాముల   కాల్షియం కావాలి  అంటే 300 గ్రాముల చీజ్,  ఒక కప్పు    ఉడికించిన క్యాబేజీ ఒక కప్పు కొవ్వు తక్కువ  పెరుగు తీసుకుంటే  సరిపోతుంది. సప్లిమెంట్స్   కంటే ఆహారం ద్వారా ఈ పోషకాలు శరీరానికి   అందితే   మంచిది.

Leave a comment