విశ్వవ్యాప్తంగా బద్దకస్తులు అన్న విషయం పైన స్టాన్ ఫోర్డ్ వర్శిటీ పరిశోధకులు సంవత్సరాల తరబడి పరిశోధనలు చేశారు. మొత్తంగా 46 దేశాల్లో పరిశోధనలు చేస్తే బద్దకస్తుల లిస్టు లో భారత దేశానికి 36వ స్థానం వచ్చింది.వాకింగ్ కు భారతీయులు దూరం.  రోజుకు సగటున 4297 అడుగులు మాత్రమే నడుస్తారు. ఇక మహిళలు సగటున 3684 అడుగులే నడుస్తున్నారట. 46 దేశాల్లోని 70వేల మంది స్మార్ట్ ఫోన్ లలో ఉన్న స్టెప్ కౌంటర్ల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. చైనీయులు అందరి కంటే ఎక్కువ నడిచే వాళ్ళుగా ఉన్నారు. హాంకాంగ్ వాళ్ళయితే రోజుకి 6800 అడుగులు నడుస్తున్న్నారని తేలింది. మహా బద్ధకం గాళ్ళు  ఇండోనేషియా వాళ్ళు. పై వరసలో చైనా, ఉక్రెయిన్, జపాన్ దేశాలున్నాయి. ఈ లిస్టు చూశాకయినా బద్ధకం వదిలించుకుని ఆరోగ్యం కోసం నడవాలని ఆశ.

Leave a comment