Categories
గర్భధారణ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు బిడ్డ ఆరోగ్యం కోసం జీవన శైలి ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వాల్సింసిందే. ఇంట్లో పని ప్రదేశంలో హానికరమైన రసాయినాలకు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే అధిక బరువు ఉండకూడదు. ఒక వేళ వుంటే వ్యాయామాలు, సమతుల్యాహారం తో తగ్గించుకోవాలి. సరయిన బరువు కనుక వుంటే గుండె సంబందిత సమస్యలు రక్త పోటు పెరగటం ఏమీ వుండవు. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గర్భం ధరించక సాధారణంగా తలెత్తే వెన్ను నొప్పి అలసట, మలబద్దకం ఏమీ వుండవు. అలాగే బిడ్డ ఆరోగ్యానికి తల్లి ప్రశాంతంగా వుండే వాతావరణం కావాలి. ఎలాంటి వత్తిడి ఉండ కూడదు. గర్భం ధరించాక డెలివరీ అయ్యాక కుడా ప్రశాంతంగా ఉండగలిగే అవకాశం కల్పించాలి.