ఎ లైఫ్ లెస్ ఆర్టినరీ బుక్ రాసిన బేబీ హాల్డార్ ఒక పని పనిషి. ముగ్గురు పిల్లలతో, భర్త తాగుడు తో పెట్టే హింస భరిచలేక ఇల్లు వదిలి ఢిల్లీ చేరిన బేబీ హాల్డార్ ఇళ్ళల్లో పని వెతుక్కుంటుంది. గుర్గావ్ లో ఒకే ఇంట్లో ప్రొఫెసర్ ప్రభోద్ కుమార్ సంరక్షకురాలిగా చేరిన బేబీ హాల్డార్ ఆయన ప్రోత్సాహం తో రాయడం మొదలు పెట్టింది. నాట్ బుక్ మార్జిన్ నుంచి ఆమె రాసిన కధను సరిదిద్ది. పొరపాట్లు చెప్పి. ఆమెతో తన కధను తానే చెప్పుకునేట్లు గా చేసారు ప్రొఫెసర్. ఆమె జీవిత కధ అది. ఎందరో పనిమనుషుల వ్యధ ఆ పుస్తకం సమాజంలో స్త్రీల పట్ల సాగుతున్న అణిచివేతకు అద్దం పట్టిన ఈ పుస్తకం బేబీ హాల్డార్ ను సెలబ్రెటీని చేసినది. ఇప్పుడు ఇంకో పుస్తకం రాస్తోంది బేబీ హాల్డార్. ఈమెకు ఇంత సాయం చేసిన ప్రొఫెసర్ ప్రభోద్ కుమార్ ప్రముఖ రచయిత ప్రేమ్ చంద్ మనుమడు.
Categories