Categories

గర్భవతిగా ఉన్నప్పుడు కుటుంబం మొత్తం ఆమె పైన అపరిమితమైన శ్రద్ద చూపించాలి అంటున్నారు డాక్టర్లు. గర్భిణిగా స్త్రీల మానసిక ఆందోళన పుట్టే బిడ్డల పై తప్పనిసరిగా ఉంటుందంటున్నారు. ఎలాంటి ఆందోళన ఒత్తిడి లేని ప్రశాంతమైన వాతావరణంలో ఆమె ప్రసవం జరగాలంటున్నారు. కడుపులో ఉన్నప్పుడే ఆందోళనకు గురైతే పిల్లల ప్రవర్తనలో తేడాలోస్తాయి. పుట్టిన మూడేళ్ళకే ఈ విషయం గమనించవచ్చంటున్నారు. చదువులో వెనకబడటం ప్రవర్తనతో విసిగించటం ప్రతిదానికి పెద్దవాళ్ళతో ఉద్రేకపడటం వంటి లక్షణాలను పిల్లలలో గమనించవచ్చు అంటున్నారు డాక్టర్లు. పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని గర్భిణిని ఒత్తిడికి గురి కాకుండా చూసుకోమంటున్నారు.