ఒక కప్పు పెరుగులో కాస్త పండ్ల రసం కలుపుకొని తింటే అస్సలు ఆకలి వేయదు .ఇలాంటిదే ప్రూట్ యోగర్ట్ .యోగర్ట్ ఫ్రూట్ క్రీమ్ అన్నీ రకాల పండ్ల ఫ్లేవర్లతో అచ్చం ఐస్ క్రీమ్ లా వస్తోంది పెరుగు. వెనీలా,మామిడి,స్ట్రాబెర్రీ,ఆరెంజ్, ఫైనాపిల్ ఒకటేమిటి సీజనల్ గా దోరికే అన్నీ రకాల పండ్ల గుజ్జును కలిపి ఆ పండ్ల ఫ్లేవర్ తో వస్తాయి. అలాగే పండ్లు ,నట్స్ కలిపి అచ్చం ఐస్ క్రీమ్ లాగా ప్రోజాన్ యోగర్ట్ పార్లర్స్ వచ్చాయి. మదర్ డైరీ ,బ్రిటానియా ,అముల్ ,నెస్లే కంపెనీలు ఫ్రూట్ యోగర్ట్ ఇప్పుడు పెరుగు ఇష్టపడే వారిని అలరిస్తోంది. పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు ,సెరుగులోని ప్రోబయాటిక్ ,ఆరోగ్య కరమైన బాక్టీరియా అద్భుతమైన రోగనిరోధక శక్తిని ఇస్తాయి. పేకెడ్ పెరుగు వద్దనుకొంటే ఇంట్లో అన్నీ పండ్ల ముక్కలతో కలిపి పెరుగు తింటే సరి.
Categories