వాతావరణం మారినప్పుడు, ఆ మార్పు శిరోజాలపై పడుతుంది. అందుకే కేశ సంరక్షణ తప్పదు అంటున్నారు నిపుణులు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే శెనగపిండి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు. నాలుగు స్పూన్ల శనగపిండి కి రెండేసి స్పూన్ల ఆలివ్ ఆయిల్, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి పావుగంట ఆరాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి అలాగే శనగపిండిలో మెత్తగా చేసిన మెంతుల పొడి, కొబ్బరి పాలు కలిపి వాడు కొన్న మంచిదే అరటిపండు గుజ్జు కొబ్బరి నూనె గ్లిజరిన్ తేనె కలిపిన మిశ్రమం కూడా శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది.

Leave a comment