Categories
40-50 ఏళ్ల మధ్య వయసులో వచ్చే మెనోపాజ్ తో ఏర్పడే హార్మోన్ లోపం మహిళల మెదడుపై ప్రభావం చూపెడుతుంది మెదడు కాస్త గందరగోళానికి గురి కావడంతో దేన్ని సరిగ్గా గ్రహించలేక పోతుంది. ఈ కారణం వల్లనే పని పైన దృష్టి కేంద్రీకరించ లేకపోవడం మెదడును ఏదో కప్పేసి ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఈ స్థితినే బ్రెయిన్ ఫాగ్ అంటారు అంటున్నారు ఎక్సపర్ట్స్. మెదడు పనితీరు మందగించి తగ్గిపోయిన జ్ఞాపకశక్తి ఉద్యోగ సమర్థతను దెబ్బతీస్తుంది. ఇలాంటి సమస్య రాకుండా మెనోపాజ్ పదేళ్ల ముందే జీవనవిధానం మార్చుకోవాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. యోగా, ధ్యానం చేయటం ముందుగా ప్రశాంతంగా ఉండటం ఒత్తిడి తగ్గించుకునేలా మనసుని సిద్ధం చేసుకోవాలి అంటున్నారు.