Categories
హెర్బల్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మనసు ప్రశాంతంగా తాజాగా ఉంచుతాయి. షుగర్ బ్యాలెన్స్ పెంచుతాయి. ముఖ్యంగా డాండెలియన్ వేరు తో చేసే టీ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చామంతి పువ్వు వంటి పూలు పూసే సింహ దంష్ట్రిక అనే కలుపు మొక్క వేరు మార్కెట్ లో దొరుకుతుంది దాన్ని ఓ పిచ్చి మొక్క అనుకుంటారు కానీ ప్రాచీన కాలం నుంచి దాన్ని చికిత్స కోసం వాడుతున్నారు. ఇన్ ఫ్లమేషన్ అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్ యూరినరీ ఇన్ఫెక్షన్లకు ఇది ఉపశమనం ఈ వేర్లు హెర్బల్ దుకాణాల్లో దొరుకుతాయి వీటితో చేసే టీ ఎన్నో సత్ఫలితాలు ఇస్తుంది.