నేనెప్పుడూ ఎదురుచూడని అవకాశం ఇది. ఉప ముఖ్యమంత్రి బాధ్యత చాలా పెద్దది. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టటం,ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటం ఇప్పుడు నాదృష్టి వీటి పైనే అంటోంది రేణుదేవి. ఇప్పుడు బీహార్ తోలి ఉప ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యలతో తనదైన ముద్రవేస్తానంటోంది విశ్వహిందూ పరిషత్‌ మహిళా విభాగమైన దుర్గా వాహినిలో సభ్యురాలైన రేణుదేవి చంపారన్‌, ఉత్తర బీహార్‌ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల మహిళల కోసం పోరాటాలు చేశారు.రేణు దేవి సొంత ఊరు బీహార్‌లోని బేతియా. ఆ రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన కులాల్లో ఒకటైన నోనియా సామాజిక వర్గానికి చెందినవారు.నితీష్ కుమార్ క్యాబినెట్ లో మంత్రిగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు.

Leave a comment