ముఖం పైన నూగు వంటి అవాంఛిత రోమాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్య శాశ్వతంగా పోవాలంటే ఈ పేస్ట్ ఉపయోగపడుతుంది. నారింజ తొక్కలు,నిమ్మకాయ ముక్కలు ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడి ఒక స్పూన్ తీసుకొని ఇందులో రోజ్ వాటర్,కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. నీళ్లతో కడిగేసే ముందు నెమ్మదిగా ఆరిపోయిన పేస్ట్ రాలిపోయేలా రబ్ చేస్తే చాలు. ఇలా చేస్తూ ఉంటే అవాంఛిత రోమాల సమస్య శాశ్వతంగా పోతుంది. ఈ ప్యాక్ మొహాన్ని మెరిపిస్తుంది కూడా.

Leave a comment