ఇల్లు క్లీనింగ్ చాలా కష్టం కనీసం నెలకోసరన్న ఇల్లంతా శుభ్రం చేస్తేనే కానీ ముందు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. సీలింగ్ ఫ్యాన్ నిండా దుమ్ముంతుంది డంప్ కవర్ ఫ్యాన్ రెక్కలకు తొడిగి తుడిస్తేనే దుమ్ము మంచాల పైన పడకుండా డంప్ కవర్ లో చేరుతుంది. పరుపులపై మురికి వెక్యూమ్ క్లీనర్తోనే పోతాయి. వూడవర్క్ పైన దుమ్ము పోవాలంటే , లెమున్ ఆయిల్ , వైట్ వెనిగర్ కలిపి తుడిస్తే మెరుస్తాయి. ఇక లైట్ వంటివి డిష్ వాషేర్ తో కడిగి శుభ్రం చేయాలి. ఇక మైక్రోవేవ్ కోసం ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ అరకప్పు నీరు మైక్రోవేవ్ లో మరిగిస్తే అలా మరిగిన నీళ్ల ఆవిరి నుంచి అతుక్కుపోయిన ఆహారాన్ని, అవశేషాల్ని లూజ్ అవుతాయి. అప్పుడు దాన్ని శుభ్రం చేయటం ఈజీ.

Leave a comment