నూటికి నూరు పాళ్ళు నాకు సాధాసీదాగా ఉండే కథలు నచ్చవు. ఇంతవరకు రెండు వందల కథలు విన్నాను.  కానీ ఏడెనిమిది సినిమాలు మించి చేయలేదు అంటోంది నిత్యామీనన్.  నేను చేసినవన్నీ ప్రయోగాత్మకాలే.  మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజులో 23 సంవత్సరాల అమ్మాయి తల్లిగా నటించాను. ఇక ‘అ!’లో అయితే ఆ పాత్ర రాంగ్ మెసేజ్ వెళుతోందని నా సన్నిహితులు ఎంతో భయపడ్డారు. కానీ అవి నాకు మంచి పేరు తెచ్చాయి.  కథ మంచిదైతే  నాకు పారితోషికంతో పని లేదు.  తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు అన్ని రోటీన్ గానే ఉన్నాయి.  చిన్న సినిమాలు కొన్ని ప్రయోగాత్మాకంగా వచ్చినవి మంచి వసూళ్ళు సాధించాయి కూడా.  మాలీవుడ్ లో నుంచి ఎక్కువ వెరైటీ సినిమాలు వస్తాయి.  అందుకే నాకు ఒక పట్టనా కథలు నచ్చవు కనుకనే నావి  సినిమాలు తక్కువే ఉన్నాయి అంటోంది నిత్యామీనన్.

Leave a comment