Categories
టోమోటోల్లో పూర్తి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. టోమోటో రసంతో ఫేస్ ప్యాక్ చేస్తే చర్మసౌందర్యం ఇనుమడించినట్లే .ముడతలు గీతలు పడకుండా ఉండాలంటే ఒక టోమోటో రసం ,కీరా,తేనే కలిపి మెడకు మాస్క్ వేసి ఓ ఇరవై నిమిషాలు ఆగి కడిగేయాలి. అలాగే టోమోటో రసం ఆలివ్ ఆయిల్ కలిపి మొహానికి అప్లైయ్ చేసి 20 నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. టోమోటో రసం అవకాడ పేస్ట్ కలిపి మొహానికి అప్లైయ్ చేస్తే మొటిమల సమస్య పోతుంది. అలాగే టోమోటో రసంలో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ప్యాక్ వేస్తే బావుంటుంది. ఇందులో ఓట్ మీల్ కలిస్తే చర్మం మృదువుగా అయి పోతుంది.