ఇవి బయోపిక్ లకు డిమాండ్ ఉన్న రోజులు పురిచ్చి తలైవి గా ప్రఖ్యాతి చెందిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కోసం రంగం ఎప్పటి నుంచో సిద్దంగా ఉంది. త్రిష ,నయనతార ,కీర్తీ సురేష్ అందరూ మేం సిద్దం అంటున్నారు. మరి జయలలిత ఎం.జి.ఆర్ సన్నిహితురాలు సహనటి పురుషాధిక్యతకు పేరు పడ్డ రాజకీయాల్లో గెలిచి, మెరిసన ధీర …పేదల మనసు దోచుకున్న మమతల తల్లి స్నేహానికి ప్రాణమిచ్చిన నిచ్చెలి అసెంబ్లీలో భంగపడి ప్రతిజ్ఞ చేసి మరీ పంతం నెరవేర్చుకున్న అపర కాళి , ఇన్ని కోణాలున్న ఆమె కథలో ఆమెలా నటించే అదృష్టం ఎవరికి రానుందో. ఒక అయిస్కాంతం వంటి జయలలితను ఎన్ని సినిమాలుగా తీసిన జనం చూస్తారు.

Leave a comment