Categories
Gagana

ఆస్పత్రి కట్టించిన పని మనిషి.

నాలుగిళ్ళలో పని చేస్తూ కూరగాయలు అమ్ముతూ ఒక హాస్పితల కట్టించడం, అదీ ఏ ఆధారం లేని ఒక మహిళ ఒంటరి పోరాటం చేసి నిర్మించిందంటే నమ్మగలరా? కలకత్తాలోని హన్స్ పుకుర్ గ్రామంలోని హ్యుమానిటీ హాస్పిటల్ ను కట్టించింది సుభాషిణీ మిస్త్రీ నలుగురు పిల్లల తల్లి 23 ఏళ్ళ వయస్సులో భర్తను పోగొట్టుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక అతను మరణించడం తోనే తనలాంటి వారి కోసం, ఒక కొడుకుని డాక్టర్ చదివించింది. సుభాషిణి చిన్న కొడుకు అజయ్ మిస్త్రీ డాక్టర్. 1996 ఓకే తాత్కాలిక హాస్పిటల్ గా ప్రారంభించిన ఈ హ్యుమానిటీ హాస్పిటల్ సుభాషిణీ చమటోర్చి సాధించిన విజయ్ నలుగురి పిల్లల్ని సాకలేక ఇద్దరు పిల్లల్ని అనాధాశ్రమంలో చేర్చిన సుభాషిణీ పేదల కోసం ఆసుపత్రి కట్టాలని నిర్ణయించుకోవడం, 47 ఏళ్ళ శ్రమతో దాన్ని పూర్తి చేయడం వింతల్లో వింతేనా కాదా?

Leave a comment