ఋతుక్రమంలో కాంప్స్ చాలా మందికి అనుభవం .మందుల కంటే ఆహారం ,కాస్త మసాజ్ తో ఈ సమస్యను తొలగించుకోవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. ఋతుస్రావం మొదలయ్యే ముందు ఓ వారం రోజులు ముందు నుంచే ఒక అరటి పండు తినాలి. ఆలివ్ లేదా కార్న్ ఆయిల్ ను కాస్త వేడి చేసి పొత్తి కడుపు ,వెన్నెముక కింది భాగాలపై మృదువుగా మసాజ్ చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ప్రతి రోజు సైకిల్ తొక్కటం కూడా మంచిదే అల్లం టీ మంచి రిలాక్సేషన్ .సోయ పాలు ,గోధుమ బ్రెడ్ ,మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారం కూడా ఈ సమస్యను తగ్గిస్తుంది.

Leave a comment