భాదం పప్పుల్ని నానబెట్టి తింటేనే మంచి ఫలితం ఉంటుందని వాటిలో పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయని పోషక నిపుణులు చెపుతున్నారు. బాదం తొక్కల్లో ఉండే టాన్సిన్లు అందులోని పోషకాలు శరీరంలోని ఇంకకుండా అడ్డుకుంటాయి. బాదం పప్పుల్ని కనీసం ఎనిమిది గంటలు నాననిచ్చి తింటే అందులోని పోషకాలు పూర్తిగా వంటపడతాయి. నానిన బాదం పప్పు పై తొక్క వలిచేసి ఫ్రిజ్ లో భద్ర పరిచినా వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. నానబెట్టిన పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్స్ విడుదలను వేగవంతం చేస్తాయి. ఇందులో ఉండే లైపేజ్ అనే ఎంజైమ్ విడుదల వల్ల కొవ్వు త్వరగా జీర్ణం అవుతుంది.

Leave a comment