ఈ లాక్ డౌన్ అతి పెద్ద మానసిక ఒత్తిడి.కుటుంబ సభ్యులకు దూరంగా గడపటం చాలా కష్టమైపోయింది. అయితే వర్క్ వుట్  రొటీన్ ను కొనసాగించి చురుగ్గా ఉండేందుకు ప్రయత్నంచా అంటోంది ఇలియానా లాక్ డౌన్ లో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇలియానా ఎన్నో పనులు నేర్చుకుని, అలవాటు చేసుకున్నానంటోంది.బట్టలు ఉతకటం గిన్నెలు కడగటం మధ్యాహ్నం రాత్రి భోజనానికి వండుకోవడం  ఇల్లు సర్దటం కూడా అలవాటైపోయింది. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం కన్వాస్ పై రంగులద్దుతున్న బొమ్మలు బాగా వేస్తే అప్పుడు ఎగ్జిమిషన్ లో పెడతా.సాధారణ పరిస్థితులు రాగానే అమెరికా వెళ్ళి పోతా.అక్కడకు వెళ్లిన క్వారంటైన్ లో ఉండాలి తర్వాత అయినా మా వాళ్లను కలుస్తా నేను ఉత్సాహంతో ఉన్న నంటోంది ఇలియానా. అందరూ ఇళ్ళల్లోనే భద్రంగా సేఫ్ గా ఉండండి అంటోంది.

Leave a comment