గర్భిణులలో ఉదయం లేస్తునే వికారం ,వాంతులతో ఇబ్బందిపడుతూ ఉంటారు. ఏం తినాలన్న ,తాగాలన్న భయపడతారు. డాక్టర్ ఈ లక్షణాలు తగ్గించేందుకు విటమిన్ బి6 లేదా ఇతర మందుల్ని సూచిస్తారు. అయితే మూడు వారాల పాటు ప్రతిరోజు అల్లం తీసుకొంటే వారికి వికారపు లక్షణాలు తగ్గుతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పైగా ఈ అల్లం గర్భస్థ శిశువుపై ఎటువంటి దుష్ప్రభావం చూపించదు. కొంచెం తేనె అల్లం కానీ అల్లంతో చేసిన టీ కానీ తీసుకొన్న ఈ వికారం ఇబ్బంది పెట్టదు అంటున్నారు.కానీ అతిగా ఏదైనా ప్రమాదం.

Leave a comment