కోవిడ్-19 లక్షణాలు అందరికీ ఒకే విధంగా ఉండవు తీవ్రత కనిపించకపోతే హోమ్ ఐసోలేషన్ లో ఉండమని చెబుతారు డాక్టర్లు. అలాంటప్పుడు జ్వరంతో ఉంటే కనుక శరీరానికి శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి ప్రోటీన్స్, విటమిన్స్ ,మినరల్స్ తేలికగా అరిగే ద్రవపదార్థాలు తీసుకోవాలి బాదం, జీడిపప్పు, వేరుశెనగలు, నువ్వులు తినాలి పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు మంచివి.రుచి వాసన తెలియకపోతే కొద్ది మోతాదులో మసాలాలు కలిపిన సువాసనలు వెదజల్లే ఆహారం ఇవ్వాలి.వెజిటేబుల్ పలావ్,కిచ్చడి, పొంగలి, చారు, రసం వంటివి కూడా ఆరోగ్యం.పొట్టుతో ఉన్న పప్పు దినుసులు ఆకుకూరలు కాయగూరల వినియోగం ఎక్కువగా ఉండాలి. నిమ్మ బత్తాయి రసం నుంచి కావలసినంత విటమిన్-సి అందుతోంది.

Leave a comment