Categories
ప్రతి ఫోటో అద్భుతం అనలేము కానీ ఫోటో తీసిన సందర్బం లేదా తీయటం లోని సాంకేతిక నైపుణ్యం వంటి కారణాలతో కొన్ని ఫోటోలు ఎంతో ప్రాచుర్యం తెచ్చుకొంటాయి . బోలెడంత ఖరీదు పలుకుతాయి . జర్మనీ కి చెందిన ఆండ్రియాస్ గుస్కి తీసిన రైన్ 2 అనే ఫోటో ప్రపంచం లో అత్యంత ఖరీదైంది . 1999లో తీసిన ఈ ఫోటో రైన్ నది దృశ్యం చుట్టు పంటపొలాలు తెల్లని ఆకాశం ప్రశాంతంగా పారుతున్న రైన్ నది చిత్రం రొమాంటిక్ లాండ్ స్కెప్ గా చూసిన వాళ్ళు ప్రశంసల వర్షం కురిపించారు . ఈ ఫోటో ఖరీదు 26 కోట్లు రూపాయిలు .