ఒక్కసారి ఆడవాళ్ళు మా ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే చాలు ఇక అన్ని హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయి. అంటున్నారు ఈ స్టార్టప్ మెదలుపెట్టిన ముగ్గురు ఢిల్లి కుర్రాళ్ళు. fuddy పేరుతో 2014లో ఢిల్లీలో లాంచ్ ఆయిన ఈ స్టార్టప్ కేవలం మహిళల సౌకర్యం,ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని మహిళలు నిలబడే ముత్రవిసర్జన చేసే చిన్న పరికరం తయారు చేశారు.అపరి శుభ్రంగా ఉండే మరుగుదొడ్లు వాటిని ఉపయోగిస్తే ఇన్ ఫెక్షన్లు రావడం గుర్తించి దాన్ని తయారు చేశారు. దీని సాయంతో టాయ్ లెట్ సీటుకు తగలకుండా మూత్ర విసర్జన చేయవచ్చు. దీన్ని పర్స్ లో పెట్టుకుని తీసుకుపోయి వాడాక పారేయవచ్చు.ఇలాంటిదే ఢిల్లీ ఐఐటీల్లో టెక్స్ టైల్ ఇంజనీరింగ్ చదివే ఇద్దరు అబ్బాయిలు సాస్ఫీ అనే పరికరం తయారు చేశారు. ఇదీ ఆన్ లైన్ లో అమ్మకంలో ఉంది. ఢిల్లీలోని అన్ని మందుల దుకాణాల్లో దొరుకుతుంది. ఖరీదు పది రూపాయలు.
Categories