దాదాపు అన్ని సౌందర్య ఉత్పత్తుల్లోనూ వేప తప్పకుండా ఉంటుంది.ఆకులు ,గింజలు బెరుడు నూనె అన్నింటిలోనూ సౌందర్య గుణాలున్నాయి. యాంటీసెప్టిక్ ,యాంటీ ఇన్ ప్లమేటరీ ,యాంటీ ఫంగల్ గుణాలు వేపలో అధికంగా ఉన్నాయి. విటమిన్ ఇ కూడా ఎక్కువే .ఫ్యాటీ యాసిడ్స్ బాక్టీరియాను తొలగించే సహజ రిపెల్లెంట్ గా పని చేస్తుంది. వేప ఆకుల్ని నీటిలో వేసి మరగనిచ్చి ఆకుల వర్ణం నీళ్ళలోకి వస్తుంది. ఈ ఆకుపచ్చని నీళ్ళను చల్లార్చి సౌందర్యసహయకారిగా వాడుకోవచ్చు.తేనె ,పెరుగు సోయాపాలు ఈ వేప నీళ్ళు కలిపి ముఖం పై ప్రతి రోజు రాస్తే మొటిమలు,మచ్చలు పోతాయి.వైట్ హెడ్స్ పోతాయి. వేప ,తేనె అద్భుతమై మాయిశ్చరైజర్లు. వేప నీళ్ళలో తేనె కలిపి జుట్టుకు రాసి స్నానం చేస్తే కండిషనర్ గా పని చేస్తుంది. ఇక వేప నూనె సబ్బులు ,బాత్ పౌడర్లు ,షాంపులు,లోషన్లు,క్రీములు ,టూత్ పేస్టుల్లో నీమ్ లీఫ్ కాఫ్యూల్స్ తో వాడతారు.

Leave a comment